బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రూ.2,500 కోట్లు ఇస్తే

బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రూ.2,500 కోట్లు ఇస్తే

కర్ణాటకలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కావడానికి రూ.2,500 కోట్లు ఇవ్వాలని తనను అడిగారని బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ యత్నాల్‌ ఆరోపించారు. కొందరు ఏజెంట్లు డిమాండ్‌ చేశారని తెలిపారు. రాజకీయాల్లో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. డబ్బులతో పదవుల ఆశ చూపే దొంగలను నమ్మకూడదు. పార్టీ టికెట్‌ ఇప్పిస్తాం, సోనియా గాంధీ లేదా జేపీ నడ్డాతో సమావేశం ఏర్పాటు చేస్తాం అంటూ కొందరు ఆశ్రయిస్తుంటారు. అలాంటి వారు నా వద్దకు కూడా ఒకసారి వచ్చారు.  రూ.2500 కోట్లు ఇస్తే సీఎం చేస్తామన్నారు. రూ.2500 కోట్లు అంటే వారు ఏమని అనుకుంటున్నారని నేను ఆలోచనలో పడ్డాను. అంత డబ్బు ఎక్కడ ఉంచుతారు? అన్నది నాకు అర్థం కాలేదు. అందువల్ల ఇలా టికెట్లు, పదవుల ఆశ చూపే కంపెనీలు పెద్ద స్కామ్‌ అని అన్నారు.

 

 

 

Tags :