కర్ణాటక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాయ్‌చూర్‌ ను తెలంగాణలో

కర్ణాటక ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. రాయ్‌చూర్‌ ను తెలంగాణలో

రాయ్‌చూర్‌ పట్టణాన్ని తెలంగాణలో కలిపేయాలి అంటూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్‌ శివరాజ్‌ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. డాక్టర్‌ శివ్‌రాజ్‌ చేసిన వ్యాఖ్యలతో కూడిన వీడియోను అటాచ్‌ చేసి క్రిషాంక్‌ అనే టీఆర్‌ఎస్‌ నాయకుడు చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధికి సరిహద్దుల ఆవల నుంచి కూడా ఈ విధంగా ధ్రువీకరణ లభిస్తోంది. సాక్షాత్తూ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాయ్‌చూర్‌ను తెలంగాణలో కలపాలని చెబుతున్నారు. ఆయన డిమాండ్‌ను స్వాగతిస్తూ అందరూ చప్పట్లు కొడుతున్నారు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. అంతకు ముందు టీఆర్‌ఎస్‌ నాయకుడు క్రిషాంక్‌ తన ట్వీట్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనను కొనియాడారు.

 

Tags :