బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. 2024 తర్వాత

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..  2024 తర్వాత

కర్ణాటక మంత్రి, బీజేపీ నేత ఉమేశ్‌ కత్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశాన్ని 50 రాష్ట్రాలుగా చేయాలని ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా కర్ణాటక కూడా రెండుగా విడిపోయి, కొత్తగా ఉత్తర కర్ణాటక రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్నారు. ఈ విషయంపై మోదీ లోతుగా ఆలోచన చేస్తున్నట్టు తనకు తెలిసిందని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మోదీ కర్ణాటకను  2, మహారాష్ట్రను 3, ఉత్తరప్రదేశ్‌ను 4 రాష్ట్రాలుగా  విభజించాలని నిర్ణయించారని వ్యాఖ్యానించారు.

 

Tags :