సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

సీఎం కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మకరరాశిలోకి సూర్యని ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయం పుణ్యకాలమని..ప్రజలు సిరి సంపదలతో, భోగ భాగ్యాలతో తులతూగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. స్వరాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసుకోగలిగామని, పంటపెట్టుబడి సాయం, పలు రైతు సంక్షేమ పథకాలు, పటిష్ట చర్యలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో నిత్య సంక్రాంతిని నెలకొల్పిందని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణలో వ్యవసాయం అనుబంధ రంగాలలో పండుగ వాతావరణం నెలకొల్పామన్నారు. తెలంగాణ వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిలాగే అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

Tags :