సచివాలయం నిర్మాణ పనులు పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ సమయంలో ఆయన వెంట పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు, ఇంజినీర్లు కూడా ఉన్నారు. సచివాలయం చిన్నచిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయింది. ఈ భవనం 6వ అంతస్తులో సీఎం ఛాంబర్, సీఎంఓ, అధికారుల ఛాంబర్స్, కేబినెట్ లు నిర్మించారు. ఇదిలా వుండగా సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోకు సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయాన్ని ప్రారంభిచనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు ఇక్కడ వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఝార్కండ్ సీఎం హేమంత్ సోరెన్, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, బీఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్, ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులు కూడా హాజరు అవుతారని సమాచారం. అదే రోజు సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది.