సీఎం కేసీఆర్ గుడి అమ్మబడును!

సీఎం కేసీఆర్ గుడి అమ్మబడును!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అభిమానంతో ఓ వ్యక్తి గుడి కట్టించాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రవీందర్‌ కేసీఆర్‌పై ఉన్న అభిమానంతో తన ఇంటి ఆవరణలో గుడి కట్టించాడు. అందులోనే కేసీఆర్‌ పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు కూడా చేస్తున్నాడు. అంతలా అభిమానం చాటుకున్న తనకు కేసీఆర్‌, కేటీఆర్‌ను కలిసే అవకాశం కూడా రావడం లేదని, టీఆర్‌ఎస్‌ పార్టీలో గుర్తింపు దక్కలేదని నిరాశ చెందిన కొన్ని రోజుల క్రితం బీజేపీలో చేరాడు. అప్పటి నుంచి కేసీఆర్‌ విగ్రహానికి ముసుగు వేసి నిరసన వ్యక్తం చేస్తున్నాడు. ఉద్యమంలో పాల్గొని అప్పుల పాలయ్యాని, అప్పులు తీర్చేందుకు కేసీఆర్‌ గుడిని, విగ్రహాన్ని విక్రయిస్తున్నట్లు ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

 

Tags :