రాష్ట్రపతి ఎన్నిక సీఎం కేసీఆర్ మద్దతు ఆయనకే!

రాష్ట్రపతి ఎన్నిక సీఎం కేసీఆర్ మద్దతు ఆయనకే!

రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా  కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా  ఖరారైన సంగతి తెలిసిందే. మద్దతు విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనూహ్యంగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతు పలికారు. ఈ మేరకు కేంద్ర మాజీ మంత్రి, ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ వెల్లడించారు. యశ్వంత్‌ సిన్హా అభ్యర్థిత్వానికి సంబంధించి కేసీఆర్‌తో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టు ఆయన తెలిపారు.

 

Tags :