కరోనా ఉంది...జాగ్రత్త

కరోనా ఉంది...జాగ్రత్త

కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజలను హెచ్చరిస్తూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఉత్సవాలు, పర్వదిన వేడుకల్లో జాగ్రత్తలు పాటిస్తూ చూసుకోవాలని సూచించింది. గతవారంతో పోలిస్తే 68 శాతం కేసులు పెరిగాయని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 35 జిల్లాల్లో పాజిటివ్‍ రేట్‍ ఎక్కువగా ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పండుగలు, ఉత్సవాలు అంటూ గుమికూడొద్దని  కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి రాజేశ్‍ భూషణ్‍ చెప్పారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయొద్దని అన్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మళ్లీ కేసులు పెరుగుతాయని హెచ్చరించారు. కరోనా జాగ్రత్తలు ఇంకా పాటించాలని  సూచించారు.

 

Tags :