ఇది ఎన్నికల్లో ఓటమిపాలైన అధ్యక్షుడు.. ఎగదోసిన తిరుగుబాటు

ఇది ఎన్నికల్లో ఓటమిపాలైన అధ్యక్షుడు.. ఎగదోసిన తిరుగుబాటు

2021 జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై అల్లరి మూకల దాడి ఆకస్మికంగా జరిగిందేమీ కాదని కాంగ్రెస్‌ విచారణ సంఘం తేల్చింది. ఇది ఆ ఎన్నికల్లో ఓటమిపాలైన నాటి అధ్యక్షుడు ట్రంప్‌ ఎగదోసిన తిరుగుబాటు ప్రయత్నమని స్పష్టం చేసింది. 1/6 కమిటీగా వ్యవహరించే ఈ సంఘం పార్లమెంటు భవనంపై మూకల దాడికి సంబంధించిన 12 నిమిషాల వీడియో దృశ్యాలను ట్రంప్‌ అంతరంగికుల వాంగ్యూలాలను బయట పెట్టింది. ఎన్నిల్లో పెద్దఎత్తున మోసం జరిగిందని పదేపదే ఆరోపించడం ద్వారా ట్రంప్‌ ఈ దాడిని ప్రేరేపించి అమెరికన్‌ ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని కమిటీ ఆరోపించింది.

అమెరికా ప్రజాస్వామ్యం ఇప్పటికే ప్రమాదంలోనే ఉందని 1/6 కమిటీ అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ ఎంపి బెన్నీ ఠామ్సన్‌ హెచ్చరించారు. కమిటీ వెల్లడించిన వివరాలను మితావాద ఛానళ్లు తప్ప మిగతావన్నీ ప్రసారం చేశాయి. 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ట్రంప్‌ సన్నద్ధులవుతున్న తరుణంలో 1/6 కమిటీ నివేదిక వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది.  2021 జనవరి 6న తన అనుచరులంతా కాంగ్రెస్‌ భవనం వద్దకు రావాలని ట్రంప్‌ పిలుపు నిచ్చినట్టు కమిటీ నిర్ధరించింది.

 

Tags :