బెంగళూర్‌లో KGF- 2 ట్రైలర్ ఈవెంట్‌ : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్

బెంగళూర్‌లో  KGF- 2 ట్రైలర్ ఈవెంట్‌ : తెలుగు ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ చరణ్

భారీ బడ్జెట్ తో సర్వ హంగులతో KGF- 2 సినిమా రూపొందించారు ప్రశాంత్ నీల్. చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్న ఆయన భారీ రేంజ్‌లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారట. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. పలు భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటే KGF- 2.  కేజీయఫ్ చాప్టర్ నుంచి నేడు (మార్చి 27) అప్డేట్ వచ్చేసింది. బెంగళూర్‌లో ట్రైలర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. కాసేపటి క్రితమే అన్ని భాషల్లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్ విడుదల చేశాడు. కేజీయఫ్ సినిమా ఓ సంచలనం. ఈ చిత్రం వచ్చి మూడేళ్లు దాటినా కూడా ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. రాకీ భాయ్ డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే వస్తోంది. కరోనా వల్ల ఎప్పుడో రావాల్సిన ఈ మూవీ వాయిదాలు పడుతూ వచ్చింది.

మొత్తానికి ఈ చిత్రం ఏప్రిల్ 14న రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేశారు. ఇందులో భాగంగానే గత వారం తుపాన్ అనే పాటను విడుదల చేశారు. ఆ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది. అయితే ఇప్పుడు ట్రైలర్‌తో అందరినీ భయపెట్టేందుకు రాకీ భాయ్ రెడీ అయ్యాడు. బెంగళూర్‌లో ట్రైలర్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను తెలుగులో రామ్ చరణ్ విడుదల చేశాడు. తమిళంలో సూర్య, కన్నడలో శివ రాజ్ కుమార్, మలయాళంలో పృథ్వీ రాజ్ సుకుమారన్, హిందీలో ఫర్హాన్ అక్తర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌లో రాకీ భాయ్ దమ్ములేపేశాడు. యాక్షన్ సీక్వెన్స్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా ఉన్నాయి. ఇందులో యశ్ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.నాకు వయెలన్స్ అంటే నచ్చదు.. కానీ వయలెన్స్‌కు నేనంటే ఇష్టం.. అందుకే నేను వయలెన్స్‌ను వదల్లేను.. నాకు ఎవ్వరీ దోస్తీ అక్కర్లేదు.. నాతో ఎవ్వరూ దుష్మన్ తట్టుకోలేడు.. బిజినెస్ చేద్దామ.. ఆఫర్లు త్వరలోనే క్లోజ్ అవుతాయి.. అమ్మా నీకు ఈ ప్రపంచంలోని బంగారం అంతా తెచ్చిస్తానమ్మా అంటూ ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక యాక్షన్ సీక్వెన్స్ చూస్తే, అందులో సంజయ్ దత్ యాక్షన్ చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది.

 

Tags :