రివ్యూ : డీలాపడ్డ 'ఖిలాడి'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : రవితేజ, డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి, యాక్షన్ కింగ్ అర్జున్, అనసూయ భరద్వాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ముకుందన్, ముఖేశ్ రుషి తదితరులు సింగీతం : దేవిశ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి : సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణు దర్శకత్వం: రమేశ్ వర్మ నిర్మాత : కోనేరు సత్యనారాయణ విడుదల తేదీ: 11.02.2022
గత ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘క్రాక్’తో సూపర్ డూపర్ హిట్ కొట్టారు మాస్ మహరాజా రవితేజ. తర్వాత అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ‘ఖిలాడి’. గతంలో రవితేజతో 'వీర' వంటి డిజాస్టర్ తీసిన డైరెక్టర్ రమేష్ వర్మ. కోవిడ్ ప్రభావంతో గత ఏడాదిలోనే విడుదల కావాల్సిన ‘ఖిలాడి’ వాయిదా పడి.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా టీజర్, ట్రైలర్‌ను గమనిస్తే రవితేజ నటనతో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి గ్లామర్, టేకింగ్, మేకింగ్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మరి సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా? అని తెలుసుకోవడానికి అసలు కథేంటో చూద్దాం.
కథ: పూజా (మీనాక్షి చౌదరి) ఇంటెలిజెన్స్ డీజీపీ (సచిన్ ఖేడేకర్) అమ్మాయి. ఆమె క్రిమినాలజీ స్టూడెంట్ . ఓ సందర్భంలో ఆమె తన స్నేహితుడి థీసిస్ కోసం సహాయం చేయాలనుకుంటుంది. ఆ క్రమంలో ఆమెకు మోహన్ గాంధీ (రవితేజ) గురించి తెలుస్తుంది. మోహన్ గాంధీ తన అత్త మామలు (మురళీ శర్మ, అనసూయ), భార్య అదితి (డింపుల్ హయతి)లను దారుణంగా హత్య చేస్తాడు. కూతురుని చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేస్తారు. తను శిక్ష అనుభవిస్తుంటాడు. అతన్ని వెళ్లి కలుస్తుంది. మోహన గాంధీ తన కథను ఆమెకు చెబుతాడు. అతడి కథ విన్న పూజా చలించి అతడికి సాయం చేయాలనుకుంటుంది. దీంతో తండ్రి సంతకం ఫోర్జరీ చేసి మరి అతడు బయటకు రావడానికి రిస్క్ తీసుకుంటుంది. గాంధీ బయటకు వచ్చే సయమంలోనే పూజా ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటుంది. మోహన్ గాంధీ అంతర్జాతీయ క్రిమినల్ అని, హోంమంత్రి చెందిన 10 వేల కోట్ల రూపాయల డబ్బును కొట్టేయానికి ఇటలీ నుంచి ఇండియాకు వచ్చినట్లు తెలుసుకుని షాక్ అవుతుంది. మరి ఆ డబ్బు ఎక్కడిది? దానిని రవితేజ ఎందుకు కొట్టేయాలనుకున్నాడు? ఆ డబ్బు కొట్టేయానికి రవితేజ ఎలాంటి పన్నాగాలు పన్నాడు అనే దాని చుట్టే కథ నడుస్తుంది.
నటీనటుల హావభావాలు: ఈ సినిమాలో మాస్ మహారాజా మార్క్‌ను మరోసారి చూపించాడు రవితేజ. ఆయన ఎనర్జీ, మితిమిరిన తెలివితెటలు మంచి కిక్ ఇచ్చేలా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో మోహన్ గాంధీగా రవితేజ షెడ్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో రవితేజ నటన, ఎనర్జీ నెక్ట్ లెవల్ అని చెప్పుకొవచ్చు. హీరోయిన్లు గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులకు కనులవిందు అందించారు. ఇక డింపుల్ హయాతి పాత్ర అమాయకంగా, రెండోది ఇంటెన్స్‌గా ఉంటుంది. రెండు క్యారెక్టర్ కూ సరిపోయిందీ ఆమె. ఈ సినిమాలోన ఆమెను హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారో సెకండాఫ్ లో తెలుస్తుంది. మరో నాయిక మీనాక్షి చౌదరికి కథలో కీలకమైన క్యారెక్టర్ దొరికింది. గ్లామర్ గా కనిపించడంలో ఈ ఇద్దరు నాయికలూ పోటీ పడ్డారు. అనసూయ, వెన్నెల కిషోర్, మురళీ శర్మ పాత్రలు కూడా రెండు షేడ్స్‌తో సాగుతాయి. తొలి భాగంలో మురళీ శర్మ ప్రకృతి ఆహారం తీసుకునే పాత్రలో నవ్వించారు. మరోవైపు సీబీఐ అధికారి అర్జున్ భరద్వాజ్ ఈ కేసును పక్కాగా విచారణ చేస్తుంటాడు. సాంకేతిక వర్గం పనితీరు : ఈ చిత్రాన్ని మొదటి నుంచి రవితేజ కెరీర్ లోనే హై ఎండ్ వాల్యూస్ తో ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు రమేష్ వర్మ విషయానికి వస్తే.. రమేష్ వర్మ తన డైరెక్షన్ పరంగా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేక అందుకోలేకపోయారని చెప్పాలి.
ఫస్ట్ హాఫ్ వరకు పర్వాలేదు కానీ సెకండ్ హాఫ్ లో తన టేకింగ్ కంప్లీట్ గా బ్యాలన్స్ తప్పినట్టు అనిపిస్తుంది. ఏమాత్రం సీరియస్ నెస్ లేకుండా అసలు కాన్సెప్ట్ కి కనెక్ట్ లేని విధంగా తన నరేషన్ ని చూపించి నిరాశపరిచారు. ఇక టెక్నికల్ టీం లో మొట్ట మొదటి హైలైట్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన సంగీతం అని చెప్పాలి. తాను ఇచ్చిన సాంగ్స్ విజువల్ గా మరింత హిట్ గా కనిపిస్తాయి అలానే తన స్టైలిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాని మరింత ఎలివేట్ చేసింది. ఇంకా సుజిత్ వాసుదేవ్, జీకే విష్ణుల సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ బెటర్ గా ఉండాల్సింది. కొన్ని ట్విస్టులు రివీల్ చేసిన విధానం బాగుంది కానీ ఓవరాల్ గా అయితే తన డైరెక్షన్ లో అంత ఎగ్జైట్మెంట్ కనిపించదు. క్లైమాక్స్ కూడా అంత బలంగా తాను ఎలివేట్ చెయ్యలేదు. అయితే అది విజువల్ గా కూడా అంతే స్థాయిలో కనిపిస్తుంది. నిర్మాతలు పెట్టిన ఖర్చుకి తగ్గ మంచి విజువల్స్ ని అయితే ఎంజాయ్ చెయ్యొచ్చు.
విశ్లేషణ : ఓ తెలివైన దొంగ 10 వేల కోట్ల రాబరికి టార్గెట్ పెడితే ఎలా ఉంటుంది, అది ఓ బడా రాజకీయ నాయకుడి వద్ద.. ఆ దొంగను పట్టుకునేందుకు సీబీఐ చేజింగ్‌లు, రన్నింగ్‌తో దర్శకుడు ఫుల్ యాక్షన్, థ్రీల్లర్ సినిమా చూపించాడు. ముఖ్యంగా సెకండ్ పార్ట్‌లో రవితేజ నటన, ఎనర్జీ నెక్ట్ లెవల్ అని చెప్పుకొవచ్చు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే “ఖిలాడి” పెట్టుకున్న అంచనాలు మ్యాచ్ చేసే విధంగా అనిపించదు. రవితేజ పెర్ఫామెన్స్ సహా హీరోయిన్స్ గ్లామ్ షో లు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు ప్రీ ఇంటర్వెల్ లు మంచి ట్రీట్ ని ఇస్తాయి. కానీ సినిమాకి కీలకం అయ్యిన సెకండ్ హాఫ్, క్లైమాక్స్ లలో డైరెక్షన్ లోపం కనిపిస్తుంది. దీనితో వీటి మూలాన కాస్త దెబ్బపడింది. మరి వీటిని పక్కన పెడితే “ఖిలాడి” రవితేజ అభిమానులకి బాగా నచ్చొచ్చు కానీ మిగతా ఆడియెన్స్ అంతగా నచ్చకపోవచ్చు.