ఎంతకాలమైనా వెతికి వెతికి అంతం చేస్తాం : బైడెన్

ఎంతకాలమైనా వెతికి వెతికి అంతం చేస్తాం : బైడెన్

అల్‌ఖైదా వ్యవస్థాపక అధ్యక్షుడు ఒసామాబిన్‌ లాడెన్‌ అంతమైన తరువాత ఆ సంస్థ నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్న అయిమన్‌ అల్‌ జవహరి మరణాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్వయంగా ప్రకటించారు. వైట్‌హౌస్‌ నుంచి ఈ మేరకు ఆయన ప్రకటన చేశారు. ఇప్పుడు న్యాయం జరిగింది. ఆ ఉగ్రవాది ఇక లేడు. ఎక్కడ దాకున్నారన్నది సమస్యే కాదు. ఎన్నాళ్లు పడుతుందన్నది ప్రశ్నే కాదు. మీరు అమెరికాకు, అమెరికా పౌరులకు ప్రమాదకారులని తెలిస్తే చాలు. ఎంతకాలమైనా వేచి చూసి వెతికివెతికి అంతం చేస్తాం అని బైడెన్‌ స్పష్టం చేశారు. జవహరి కదలికలపై నెలల తరబడి వేచి చూశాం. నిఘా విభాగం ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించాం. చివరకు పక్కా ప్రణాళికతో అత్యంత కచ్చితత్వంతో గురి తప్పని విధంగా దాడి చేయాలని ఆదేశించానని బైడెన్‌ వెల్లడించారు.

 

Tags :