అక్టోబర్ 9న 'కిరాక్ పార్టీ' తో 'జీ కుటుంబం అవార్డ్స్' సందడిని మొదలుపెట్టనున్న 'జీ తెలుగు'

అక్టోబర్ 9న 'కిరాక్ పార్టీ' తో 'జీ కుటుంబం అవార్డ్స్' సందడిని మొదలుపెట్టనున్న 'జీ తెలుగు'

'జీ తెలుగు' కి చెందిన షోస్ లో పాల్గొనే నటులందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూసే పండగలాంటి ఈవెంట్ 'జీ కుటుంబం అవార్డ్స్'. ప్రేక్షకులను మెప్పించి, వారిని వినోదింపజేయడానికి నటులు చేసే కష్టాన్ని గురిస్తూ ఇచ్చే ఈ అవార్డ్స్ యొక్క సందడి ఈసారి కాస్త తొందరగా మొదలయ్యింది. తెలుగు టీవీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా 'కిరాక్ పార్టీ' పేరుతో గ్రాండ్ ప్రీ-ఈవెంట్ పార్టీని హోస్ట్ చేసిన 'జీ తెలుగు', ఈ వేడుకలో భాగంగా నటులు చేసిన సందడిని త్వరలో ప్రేక్షకుల ముందుకి తేనుంది. శ్రీముఖి-సుధీర్ యాంకర్లుగా వ్యవహరించిన ఈ 'కిరాక్ పార్టీ' ఈ ఆదివారం (అక్టోబర్ 9న) సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.    

శ్రీముఖి, సుధీర్, రోహిణి, సద్దాం, బాబా భాస్కర్ తదితరులు చేసే అల్లరి మరియు 'జీ తెలుగు' నటుల వరుస వినోదాత్మక ప్రదర్శనలతో ఒక్క క్షణం కూడా బోర్ కొట్టకుండా ఈ ఈవెంట్ సాగనుంది. నటుడు పోసాని కృష్ణమురళి 'జీ తెలుగు' అత్తాకోడళ్లతో కలిసి చేసిన బతుకుజట్కాబండి స్పూఫ్, సీరియల్ హీరోహీరోయిన్లు చేసిన డాన్స్ మరియు కామెడీ ప్రదర్శనలు, జీ సరిగమప సింగర్స్ యశస్వి కొండేపూడి మరియు ప్రణవ్ కౌశిక్ జంటగా లైవ్ బ్యాండ్ తో పాడిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. అంతేకాకుండా, రోహిణి, సాయి కిరణ్, గోకుల్, మరియు ఆకర్ష్ కూడా మైక్ పట్టి తమ గాత్రంలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. 

ఈ హై-వోల్టేజ్ ఈవెంట్లో ఇటీవలే మొదలైన 'పడమటి సంధ్యారాగం' మరియు త్వరలో ప్రారంభం కానున్న 'అమ్మాయిగారు' సీరియల్స్ కి చెందిన నటీనటులను కూడా పరిచయం చేయనుంది 'జీ తెలుగు'. చివరగా, సుధీర్ హిట్ పాటలకు చేసిన డాన్స్ పెర్ఫార్మన్స్ షో కి హైలైట్ గా నిలిచి వీక్షకులను హోరెత్తించనుంది.

ఈ ఆదివారం (అక్టోబర్ 9) సాయంత్రం 6 గంటలకు ప్రసారమయ్యే 'జీ కుటుంబం అవార్డ్స్ - కిరాక్ పార్టీ' ని కుటుంబసమేతంగా తప్పక వీక్షించండి, మీ జీ తెలుగు లో

 

Tags :
ii). Please add in the header part of the home page.