డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ దుగ్గిరాల

డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్ దుగ్గిరాల

అమెరికాలో 46 ఏళ్ల చరిత్ర కలిగిన డిట్రాయిట్‌ తెలుగు అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా కిరణ్‌ దుగ్గిరాల తాజాగా ఎన్నికై అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా కన్వెన్షన్‌ కన్వీనర్‌ రవి పొట్లూరి, నరేన్‌ కొడాలితో పాటూ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. పదిమందికి పైగా డిట్రాయిట్‌ అసోసియేషన్‌ పూర్వాధ్యక్షులు హాజరై నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. కిరణ్‌ నాయకత్వంలో డీటీఏ కొత్త పుంతలు తొక్కుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వెయ్యి మందికి పైగా ఎన్నారైలు, డీటీఏ మద్దతుదారులు పాల్గొన్నారు.

 

 

Tags :