వాషింగ్టన్‌ సదస్సుకు కిరణ్మయి జోషి

వాషింగ్టన్‌ సదస్సుకు కిరణ్మయి జోషి

మనుషులు, జంతువుల్లో ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించి, నయం చేసేందుకు అవసరమైన పరిశోధనను తెలంగాణ రాష్ట్ర్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్మయి జోషి చేశారు. ఇదే అంశంపై అమెరికన్‌ సొసైటీ ఫర్‌ సెల్‌ బయోలజీ, యూరోపియన్‌ మాలిక్యులర్‌ బయోలజీ ఆర్గనైనేషన్‌ సంయుక్తంగా డిసెంబర్‌ 3 నుంచి 7 వరకు వాషింగ్టన్‌ డీసీలో నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో కిరణ్మయి ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఈ వేదికపై సుమారు 15 నిమిషాల పాటు ప్రజెంటేషన్‌ ఇచ్చే అవకాశం వచ్చిందని ఆమె తెలిపారు.

భారతదేశం నుంచి సదస్సులో పాల్గొనే అవకాశం ఒక్క కిరణ్మయి జోషికే దక్కింది. ఇందుకు భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని బయోటెక్నాలజీ విభాగం అనుమతిచ్చింది. సదస్సులో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని కిరణ్మయి జోషి తెలిపారు. సంగారెడ్డికి చెందిన కిరణ్మయి రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌ కూతురు. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ వరకు స్థానికంగానే చదివారు. కోఠీ ఉమెన్స్‌ కళాశాలలో బీఎస్సీ, కూకట్‌పల్లి జేఎన్‌టీయూహెచ్‌లో ఎంఎస్పీ పూర్తి చేశారు. ప్రస్తుతం గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యానిమల్‌ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈమెకు గైడ్‌గా సైంటిస్ట్‌ డాక్టర్‌ గిరీష్‌ కె.రాధా కృష్ణన్‌ వ్యహరిస్తున్నారు.

 

 

Tags :
ii). Please add in the header part of the home page.