MKOne Telugu Times Youtube Channel

ఈ మార్పు శిక్ష కాదు.. అది మోదీ విజన్

ఈ మార్పు శిక్ష కాదు.. అది మోదీ విజన్

కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజును న్యాయశాఖ నుంచి తప్పిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అనూహ్య నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు భూవిజ్ఞాపనశాస్త్ర శాఖను అప్పగించారు. తాజాగా కొత్త శాఖ బాధ్యతలు స్వీకరించిన రిజిజు ఈ మార్పులన్నీ మోదీ విజన్‌లో భాగమని వ్యాఖ్యానించారు. ఈ మార్పు శిక్ష కాదు. అది ప్రభుత్వ ప్రణాళికలో భాగం. అది మోదీ విజన్‌ అని అన్నారు. న్యాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థతో ఉన్న అభిప్రాయ బేధాలపై ప్రశ్నించగా, ఇది రాజకీయాల గురించి మాట్లాడే సమయం కాదు. నా గత మంత్రిత్వ శాఖ గురించి ప్రశ్నలు వేయొద్దు. అవి ఇక్కడ సరికాదు. మోదీ నాకు అప్పగించిన కొత్త బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే నా పని అని అన్నారు. 

 

 

Tags :