అగ్నిపథ్ తో దేశానికి మంచే తప్పా.. ఎవరికీ నష్టం లేదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అగ్నిపథ్ తో దేశానికి మంచే తప్పా.. ఎవరికీ నష్టం లేదు  : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అగ్నిపథ్‌తో దేశానికి మంచే తప్పా ఎవరికీ నష్టం జరగదని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కిషన్‌ రెడ్డి మరోసారి స్పందించారు. సైన్యంలో సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన అగ్నిథ్‌ పథకంపై అనవసరంగా రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే 1999లో అగ్నిపథ్‌కు బీజం పడిరదని తెలిపారు. అగ్నివీరులుగా ఒక్కసారి పనిచేస్తే ఆత్మవిశ్వాసం ఏర్పడుతుందని, తద్వారా సైన్యం నుంచి బయటికి వచ్చాక బిజినెస్‌, ఉద్యోగాల్లోనూ మేటిగా రాణించవచ్చని పేర్కొన్నారు. సైన్యంలో పనిచేయాలని చాలా మంది ఆశతో ఉన్నారు. అలాంటి వారు అగ్నిపథ్‌లో చేరవచ్చు. అగ్నివీరులుగా చేరి బయటకు వచ్చిన తర్వాత ఎందులో చేరడానికైనా ఆ నైపుణ్యాలు ఉపయోగపడతాయన్నారు. బయటికి వెళ్లాక అనేక విద్య, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మహీంద్ర లాంటి కంపెనీలు సైతం అగ్నివీరులందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ప్రతి ఒక్కరూ అగ్నిపథ్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :