నవరత్నాల పేరుతో ప్రజలను.. నవ విధాలా

నవరత్నాల పేరుతో ప్రజలను.. నవ విధాలా

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మద్యాంద్రప్రదేశ్‌గా మార్చారని తెలుగుదేశం పార్టీ నేత కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ నవరత్నాల పేరుతో ప్రజలను నవ విధాలా పిండుతున్నారని అన్నారు. వైసీపీ అరాచక పాలనను సమూలంగా తుడిచి పెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నాటు సారా తయారీ జరుగుతోందని ఆరోపించారు. పన్నులు, చార్జీలు పెంచుతూ ప్రజల రక్తాన్ని పిలుస్తున్నారని మండిపడ్డారు. మహిళలపై దాడులు జరుగుతుంటే మంత్రులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు.

 

Tags :