హుజురాబాద్ కోసం దళిత బంధు... మునుగోడు కోసం గిరిజన బంధు

హుజురాబాద్ కోసం దళిత బంధు... మునుగోడు కోసం గిరిజన బంధు

హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో దళిత బంధు పథకం పెట్టారని, మునుగోడు ఉప ఎన్నికకు గిరిజన బంధు పథకం తెస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షం లేకుండానే చేసి కేసీఆర్‌ ప్రజాస్వామ్యన్ని  ఖూనీ చేశారని విమర్శించారు. 1400 యువకుల ఆత్మబలిదానాలతో తెలంగాణ వస్తే కేసీఆర్‌ కుటుంబం రాజకీయ పాలన చేస్తున్నారని ఆరోపించారు. ప్రాజెక్ట్‌ల పేరు మీద వేల కోట్ల రూపాయలు కేసీఆర్‌ కుటుంబం దోపిడీ చేసిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రపంచంలోని ప్రతి తెలుగు వారు గమనిస్తున్నారని తెలిపారు.  

 

Tags :