తాను పార్టీ మారేది లేదు... కోమటిరెడ్డి

తాను పార్టీ మారేది లేదు... కోమటిరెడ్డి

కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్న సోషల్‌ మీడియాతో వస్తున్న వార్తలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. తాను పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు. పార్టీ మార్పు అంశంపై కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నా తమ్ముడు రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేయడం నాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పారు. పార్టీకి విధేయునిగా పార్టీ గెలుపుకోసం కష్టపడి పనిచేస్తానన్నారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌ను నేను ఎందుకు పార్టీ మారుతా. నియోజకవర్గం అభివృద్ధి కోసం కేంద్ర మంత్రులను కలవడం తప్పు కాదు. నేను పార్టీ మారుతున్న వస్తున్న వార్తల్లో నిజం లేదు. మా ఫ్యామిలీపై రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను పార్టీ మారుతున్నట్లు చెప్పే వారికి లీగ్‌ నోటీసులు పంపుతా అని అన్నారు.

 

Tags :