కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు.. ఆలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాలి

కొండా సురేఖ సంచలన  వ్యాఖ్యలు.. ఆలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్ చేయాలి

కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. గాంధీ భవన్‌లో పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  అందరం కలిసి పని చేయలేకపోవడం వల్లే ఓడిపోయాం. ఇప్పటికైనా అందరం కలిసి పని చేయాలి. పార్టీకి నష్టం చేసేవారిని ఉపేక్షించడం ఎందుకు? ఎంపీ కోమటిరెడ్డి పార్టీకి నష్టం చేకూర్చారు. అలాంటి వాళ్లను వెంటనే సస్పెండ్‌ చేయాలి అని ఆమె వ్యాఖ్యానించారు.  ఈ క్రమంలో  పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకున్నారు. వ్యక్తిగత అంశాలు మాట్లాడవద్దన్న రేవంత్‌ ఏమైనా ఉంటే ఇన్‌ఛార్జ్‌ను కలవాలని సూచించారు. ఇది పార్టీ సమావేశం గనుక సమావేశం ఎజెండాపైనే మాట్లాడాలని ఆయన కొండా సురేఖకు సూచించారు. దీంతో ఆమె శాంతించారు.

 

 

Tags :