దీనిని మహిళాలోకమంతా ఖండించాలి : కొండా సురేఖ

దీనిని మహిళాలోకమంతా ఖండించాలి : కొండా సురేఖ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో మహిళలను అవమానపరిచేలా మాట్లాడటం దారుణమని మాజీమంత్రి కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ తీరు గర్హనీయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై అసెంబ్లీలో వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడడం హేయమని పేర్కొన్నారు. ఒక మాజీ సీఎం కుమార్తె, మరో మాజీ ముఖ్యమంత్రి భార్యపై ఇష్టానుసారం మాట్లాడి ఆఫ్‌ ది రికార్డు, ఆన్‌ రికార్డు అని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయాల కోసం ముఖ్యంగా మహిళలను అవమానపరచడం పద్ధతి కాదన్నారు. దీనిని మహిళాలోకమంతా ఖండిరచాలని కోరారు. వైతెపా నాయకురాలు షర్మిల, టీఆర్‌ఎస్‌ నాయకురాలు కవిత, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కూడా ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్‌ చేశారు.

 

Tags :