MKOne TeluguTimes-Youtube-Channel

నన్ను ఎన్ కౌంటర్ చేస్తేనే.. నా గొంతు ఆగుతుంది

నన్ను ఎన్ కౌంటర్ చేస్తేనే.. నా గొంతు ఆగుతుంది

తనను ఎన్‌కౌంటర్‌ చేస్తేనే తన గొంతు ఆగుతుందని ఎమ్మెలే కోటంరెడ్డి శ్రీధర్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రశ్నించారు. ఇసుక, మద్యం పేరుతో వ్యాపారం చేస్తుంది ఎవరని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు ఎలా చేతులు మారుతున్నాయి? వాళ్ల మీద ట్యాపింగ్‌ ఆడియోలు విడుదల చెయ్యగలరా అన్నారు. సజ్జల పోస్టుకు గ్యారెంటీ ఉంటుందా అని ప్రశ్నించారు. తనను అరెస్ట్‌ చేస్తారని ప్రచారం జరుగుతోందన్నారు. మీ ఇష్టం ఎప్పుడైనా అరెస్ట్‌ చేసుకోండి అన్నారు. ఎనీ టైమ్‌ అరెస్టు చేసుకోండి అన్నారు. ఎన్ని కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తారో చేసుకోండి అన్నారు. ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎన్నికల వేళ తెలుస్తుంది అని అన్నారు.

 

 

Tags :