మాయోన్ బృందం పొంగల్ ట్రీట్ - కృష్ణ భజన్ - మ్యూజికల్ డిలైట్..

మాయోన్ బృందం పొంగల్ ట్రీట్ - కృష్ణ భజన్ - మ్యూజికల్ డిలైట్..

ఇప్పటికే విడుదలైన ‘మాయోన్ టైటిల్ ట్రాక్’కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది ఓ మైథలాజికల్ థ్రిల్లర్‌గా వస్తుంది. ఇప్పుడు ఈ చిత్ర మేకర్స్ తర్వాతి పాట ‘కృష్ణ భజన – సింగార మధన మోహన’ను విడుదల చేయబోతున్నారు. పొంగల్/మకర సంక్రాంతి కానుకగా ఉదయం విడుదల చేయబోతున్నారు. సీనియర్ నటుడు సత్యరాజ్ తనయుడు శిబి సత్యరాజ్, తాన్య రవిచంద్రన్ జంటగా నటిస్తున్న విజువల్ వండర్ మయోన్ సినిమా. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్ ప్లస్ మొదటి పాటకు మంచి రెస్సాన్స్ వచ్చింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఈ సినిమా వస్తుండటం గమనార్హం. కిషోర్ ఎన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఇళయరాజా రాసి ట్యూన్ చేసిన ‘ది కిష్ణ భజన్’కి శ్రీనిధి శ్రీప్రకాష్ రచన చేసారు. కృష్ణ భగవానుని స్తుతిస్తూ నామసంకీర్తన రూపంలో ఏర్పాటు చేయబడింది ఈ పాట. ఇది వింటుంటే కచ్చితంగా అందరూ పాటతో కలిసి నాట్యం చేస్తారని చెప్తున్నారు చిత్రయూనిట్. అంత ఉల్లాసంగా పాట సాగుతుందని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెప్తున్నారు. దశావతారం సినిమాలో ముకుందా ముకుందా తర్వాత కృష్ణ భగవానుడికి ఆ స్థాయిలో ట్రిబ్యూట్ ఇచ్చే పాట కృష్ణ భజన్ అంటున్నారు యూనిట్. ఇంత అద్భుతమైన పాటను మాయోన్ బృందం పొంగల్/మకర సంక్రాంతి సందర్భంగా ఈ ఆనందకరమైన పాటను పంచుకోవాలని నిర్ణయించుకుంది. డబుల్ మీనింగ్ ప్రొడక్షన్‌లో అరుణ్ మొళి మాణికం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆయనే స్క్రీన్ ప్లే అందిస్తుండడం గమనార్హం. రామ్ పాండ్యన్ - కొండల రావు ఎడిటింగ్ చేస్తున్న ఈ సినిమాకు రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కన్నుల పండుగగా 'మాయోన్' పాట అలరిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు దర్శక నిర్మాతలు.

 

Tags :