బంపరాఫర్ అందుకున్న కృతి?

అక్కినేని నాగచైతన్య కెరీర్ చాలా నీరసంగా సాగుతుంది. థాంక్యూ, లాల్ సింగ్ చద్దా పరాజయాలతో ఢీలా పడ్డ చైతన్య, తన ఆశలన్నింటినీ కస్టడీ సినిమాపైనే పెట్టుకున్నాడు. కానీ కస్టడీ కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాతో నిర్మాత కంటే చైతూనే ఎక్కువ నష్టపోయాడని చెప్పాలి. ఈ సినిమా రిలీజ్ కు ముందు చైతూ కస్టడీ సినిమా తన కెరీర్ లో బెస్ట్ మూవీ అవుతుందని చెప్పాడు.
కానీ తీరా రిలీజ్ తర్వాత చూస్తే ఈ సినిమా దారుణంగా ఫెయిల్ అయింది. వెంకట్ ప్రభు మార్క్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో మచ్చుకైనా కనిపించలేదు. దీంతో చైతూకి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ సినిమాతో చైతూకి జరిగినంత డ్యామేజ్ మరెవరికీ జరగలేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు కి విజయ్ సినిమా సెట్ అయింది. యువన్ శంకర్ రాజానే సంగీత దర్శకుడు.
హీరోయిన్ కృతి శెట్టికి కూడా విజయ్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇద్దరు హీరోయిన్లు ఉండే ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా కృతిని తీసుకుందామని వెంకట్ ప్రభు విజయ్ కు రికమండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే మాత్రం కృతి నక్క తోక తొక్కినట్లే. వరుస ఫ్లాపులతో ఉన్న కీర్తికి విజయ్ తో చేసే ఛాన్స్ వస్తే అది మామూలు లక్ కాదు. ఇప్పటికే మలయాళంలో టోవినో థామస్‌తో సినిమా చేస్తున్న కృతికి, ఈ సినిమా కూడా వస్తే ఒకేసారి కోలీవుడ్, మల్లువుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ దొరికినట్లే. ఇదిలా ఉంటే చైతూ మాత్రం కస్టడీ తర్వాత తన సినిమాను శివ నిర్వాణ తో చేయనున్నట్లు తెలుస్తోంది.