ఏపీ సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఏపీ సీఎస్ గా కేఎస్ జవహర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.ఎస్‌. జవహర్‌ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ శాఖల ఉన్నతాధికారులు అభినందనలు తెలియజేశారు. 1990 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్‌ జవహర్‌ రెడ్డి సీఎంకు ప్రత్యేక కార్యదర్శిగా పని చేశారు. ఈ సందర్భగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం ఆధ్వర్యంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తి దాకా అందేందుకు కృషి చేస్తానని, పల్లెలోని పేదలకు ఫలాలు అందేలా యంత్రంగాన్ని నడిపిస్తానని జవహర్‌ రెడ్డి ప్రకటించారు. సమీర్‌ శర్మ పదవీ విరమణ నేపథ్యంలో కొత్త సీఎస్‌గా జవహర్‌ రెడ్డిని నియమిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.

 

Tags :