అమెజాన్ ఎయిర్ కార్గో సేవలు ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్‌లో తన తొలి కార్గో విమాన సేవలు ప్రారంభించింది. దేశంలో తన రవాణా వ్యవస్థను మరింత మెరుగుపర్చుకోవడంతో పాటు కస్టమర్లకు మరింత వేగవంతంగా వస్తువులను అందజేయాలనే ఉద్దేశంతో అమెజాన్ ఎయిర్ పేరుతో ఏర్పాటైన ఈ సేవలను హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభించిన అమెజాన్ ఎయిర్ సేవలతో దేశీయ విమానయానం, ఈ కామర్స్ సంస్థలకు దన్నుగా నిలువనున్నదని పేర్కొన్నారు. ఈ కార్గో సేవలు ఉత్తర అమెరికా, యూరప్ వెలుపల ప్రారంభించేందుకు తెలంగాణను ఎంచుకోవడం శుభసూచికమని అన్నారు. దేశీయ కస్టమర్లకు మరింత వేగవంతంగా వస్తువులు డెలివరీ చేయడానికి అమెజాన్‌కు ఉపయోగపడనున్నదన్నారు.
Tags :