నిక్కీ హెలీని కలిసిన మంత్రి కేటీఆర్

ఐక్యరాజ్యసమితి మాజీ అంబాసిడర్, దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హెలీని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కలిశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి వివిధ వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. అమెరికా, ఇండియా సంబంధాల నేపథ్యంలో హైదరాబాద్, తెలంగాణ ప్రాముఖ్యత గురించి హెలీతో మంత్రి కేటీఆర్ ముచ్చటించారు. ఆర్థిక వ్యవస్థ, ఎన్నికలు, రాజకీయాల గురించి నిక్కీ హెలీతో విస్తృత స్థాయిలో అభిప్రాయాలను పంచుకున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో పోటీపడుతున్న నేపథ్యంలో నిక్కీ హెలీకి మంత్రి కేటీఆర్ బెస్ట్ విషెస్ తెలిపారు.
Tags :