ఇదేనా మీరు సాధించిన ఆత్మనిర్బర్ భారత్ ?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు మహాత్మాగాంధీ స్వదేశీ స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించడానికి ఆత్మనిర్బర్ చిహ్నంగా చరఖా ఉపయోగిస్తే ఇప్పుడు చేనేత, ఖాదీ వస్త్ర ఉత్పత్తులపై జీఎస్టీ విధించిన మొదటి ప్రధానిగా నిలిచారు. ఇదేనా మీరు సాధించిన ఆత్మనిర్బర్ భారత్? కేంద్ర ప్రభుత్వం జాతికి తెలియజెప్ప స్వదేశీయ నినాదం ఇదేనా ? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Tags :