వారిపై కఠిన చర్యలు తీసుకోండి : కేటీఆర్

వారిపై కఠిన చర్యలు తీసుకోండి   : కేటీఆర్

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్ల దాడి ఘటనను మంత్రి కేటీఆర్‌ ఖండించారు. బీజేపీకి చెందిన కొందరు పోకిరీలు, దుండగులు జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో దాడికి పాల్పడ్డారని ఇలాంటి ఘటనలు సరికావన్నారు. బీజేపీ కార్పొరేటర్లను శాంతిమార్గంలో నడవాలని కోరటం గాడ్సే అనుచరులను గాంధీ మార్గంలో నడవమన్నట్టుగా అనిపిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ను మంత్రి కోరారు.

 

Tags :