MKOne Telugu Times Youtube Channel

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. భారత్‌లోనే

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. భారత్‌లోనే

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారత్‌లోనే వంట గ్యాస్‌ ధరలు ఎక్కువగా ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనపై మహబూబ్‌నగర్‌లో సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పటించిన వారు తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. మోదీ పాలనలో నిరుద్యోగం 45 ఏళ్ల గరిష్ఠానికి చేరిందని విమర్శించారు. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిపోయిందన్నారు. దేశానికి, రాష్ట్రానికి ఏమీ చేయని బీజేపీ నేతలు తెలంగాణకు వచ్చిన టీఆర్‌ఎస్‌ పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

 

Tags :