పురాతన పుష్కరిణి ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

పురాతన పుష్కరిణి ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌ని బాపూఘాట్‌లో పురాతన పుష్కరిణి బావిని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. లంగర్‌హౌస్‌ త్రివేణి సంగంలో బాపూజీ అస్థికలు నిమజ్జనం చేసి బాపూ సమాధి, ధ్యానమందిరం నిర్మించారు. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన బావిని  జీఎంఎస్‌ స్వచ్ఛంద సంస్థ పునరుద్ధరించింది. గోడలకు మొలిచిన చెట్లను తొలగించి బావికి మరమ్మతులు చేయించి రంగులు చేశారు. కేటీఆర్‌ ఈ బావిని ప్రారంభించి, ఇందులో గంగా జలాన్ని, తాబేళ్లను వదిలారు. కార్యక్రమంలో ఆయన వెంట  మేయర్‌ విజయలక్ష్మి, ఎమ్మెల్యే కౌసర్‌ మొహినుద్దీన్‌లు ఉన్నారు.

 

Tags :