హైదరాబాద్ కు రండి..! వేదాంత గ్రూప్ చైర్మన్ ను ఆహ్వానించిన కేటీఆర్

హైదరాబాద్ కు రండి..! వేదాంత గ్రూప్ చైర్మన్ ను ఆహ్వానించిన కేటీఆర్

యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్‌ ప్రముఖ వ్యాపారవేత్త, వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ఉన్న అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ‘వేదాంత గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ వేద్‌తో సమావేశం కావడం సంతోషంగా ఉంది. తెలంగాణలో వివిధ పెట్టుబడి అవకాశాలపై చర్చించి, ఆయనను హైదరాబాద్‌కు ఆహ్వానించాను’ అని మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో తెలిపారు. దీన్ని స్వాగతించిన పలువురు నెటిజన్లు.. ‘వేదాంత సంస్థ సెమీకండక్టర్‌ ప్లాంట్‌ ఏర్పాటు కోసం కోసం సరైన స్థలాన్ని వెతుకుతున్నది. మంత్రి కేటీఆర్‌ చొరవతో అది హైదరాబాద్‌కు వస్తుంది’ అని ఆశాభావం వ్యక్తంచేస్తూ ట్వీట్లు చేశారు.

 

Tags :