వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే..అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌ వరకు

వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే..అప్పుడు ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్‌ వరకు

రానున్న ఎన్నికల్లో వచ్చేది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని,  అపుడు ఎన్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌వరకు మైట్రోను విస్తారిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రెండో విడతలో నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రో  నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి జోడెద్దుల్లా పరుగులు తీస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో ప్రణాళికబద్దంగా నడుచుకొని తెలంగాణ ప్రత్యేక గుర్తింపు సాధించిందని అన్నారు. ఊకదంపుడు ఉపన్యాసాలతో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని,  పటిష్ఠమైన ప్రణాళికతో సాధ్యపడిరదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డితో తదితరులు పాల్గొన్నారు,

 

 

Tags :