యాదాద్రి తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తాం

యాదాద్రి తరహాలో వేములవాడను అభివృద్ధి చేస్తాం

వేములవాడ ఆలయాన్ని యాదాద్రి తరహాలో అభివృద్ధి చేస్తామని తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌  ప్రకటించారు. వేములవాడ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ  మహా శివరాత్రికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పించాలన్నారు. వేములవాడ జాతరకు సౌకర్యాలు కల్పించేందుకు అదనపు నిధులు కేటాయిస్తాం. జాతరలో సాంస్కవృతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి. రాష్ట్ర సాంస్కృతిక శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు కేటీఆర్‌ సూచించారు. 

 

 

Tags :