50 ఏళ్లు ఏమీ చేయలేని వాళ్లు.. ఇప్పుడేం చేస్తారు ?: మంత్రి కేటీఆర్

50 ఏళ్లు ఏమీ చేయలేని వాళ్లు.. ఇప్పుడేం చేస్తారు ?: మంత్రి  కేటీఆర్

అగ్నిపథ్‌పై ఆందోళన కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. బీజేపీ నేతలు దేశాన్ని రావణకాష్టంలాగా మార్చారు. దేశంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ.1000 దాటిందన్నారు. నల్లధనం తెస్తాన్న ప్రధాని మోదీ, నేడు తెల్లముఖం వేశారు. తంబాకు తినడం తప్ప బండి సంజయ్‌కు ఏమీ తెలియదన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఇప్పటికే 50 ఏళ్లు అధికారం ఇచ్చారు. అన్నేళ్లు ఏమీ చేయలేని వాళ్లు ఇప్పుడేం చేస్తారు అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీకి ఇక కాలం చెల్లింది. కాంగ్రెస్‌కు చరిత్రమే మిగిలిందన్నారు. రాహుల్‌ గాంధీని గంటల తరబడి ఈడీ అఫీసులో కూర్చోబెట్టినా అడిగేవారు లేరు. ఒక్క ఛాన్స్‌ అని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారని మండిపడ్డారు.

 

Tags :