ఆకట్టుకున్న పల్లవి ‘గోదా కల్యాణం’..

ఆకట్టుకున్న పల్లవి ‘గోదా కల్యాణం’..

అమెరికాలోని షార్లెట్‌లో ‘గోదా కల్యాణం’ కూచిపూడి నృత్యరూపకం ప్రదర్శించగా స్థానిక తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై కళాకారులను అభినందించారు. ప్రముఖ కూచిపూడి గురువు కేవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ రూపకం ప్రదర్శితమైంది. దీనిలో గోదా దేవి పాత్ర పోషించిన కూచిపూడి కళాకారిణి పల్లవి మాట్లాడుతూ తనకు ‘గోదా కల్యాణం’లో ఈ పాత్ర వేయడం కల గా ఉండేదని చెప్పారు. ఇప్పుడు ఆ కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ‘సత్యనారాయణ ఇక్కడకు రావడం నిజంగా మా అదృష్టం. నాకు ఎప్పటి నుంచో గోదా దేవి పాత్ర పోషించాలని ఉంది. శ్రీ వైష్ణవ కుటుంబం నుంచి వచ్చిన నేను.. చిన్నప్పటి నుంచి ఈ కథలు వింటూ వచ్చాను. గోదా దేవి నా మనసుకు చాలా దగ్గరైన పాత్ర. ఇది నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఈ అవకాశం నాకు కల్పించినందుకు సత్యనారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని పల్లవి చెప్పారు. ఆమె స్థానికంగా కూచిపూడి తరగతులు కూడా నిర్వహిస్తూ భావి తరాలకు నృత్యంపై అవగాహన కల్పిస్తున్నారు.

Click here for Photogallery

 

 

Tags :