'లాల్ సింగ్ చడ్డా' లాంటి సినిమా అమీర్ ఖాన్ ఒక్కడు మాత్రమే చేయగలడు... అలాంటి పాత్రలు చేయడం నా వల్ల కాదు : చిరంజీవి

'లాల్ సింగ్ చడ్డా' లాంటి సినిమా అమీర్ ఖాన్ ఒక్కడు మాత్రమే చేయగలడు... అలాంటి పాత్రలు చేయడం నా వల్ల  కాదు : చిరంజీవి

1994 లో విడుదలైన హాలీవుడ్ చిత్రం 'ఫారెస్టు గంప్' ఆ ఏడాది లో ఏకంగా 6 ఆస్కార్ అవార్డులను అందుకున్నచిత్రం.  విన్స్టన్ గ్రూమ్ రాసిన నవలకు ఎరిక్ రోత్ చిత్రానువాదం చేసారు. విషయానికొస్తే ఈ చిత్రం రీమేక్ హక్కులతో హిందీ, తెలుగు, తమిళ్ భాషలలో 'లాల్ సింగ్ చడ్డా' గా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ నటించి నిర్మించారు. అయితే తెలుగు వెర్షన్ కి మెగాస్టార్ చిరంజీవి సహా నిర్మాతగా ఈ చిత్రానికి సమర్పకులు గా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం  తెగ నచ్చడంతో తెలుగులో సమర్పించేందుకు చిరంజీవి ముందుకు వచ్చారు. ఇక చిరంజీవి ప్రస్తుతం ఆమిర్ ఖాన్  లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం సినిమాను వీక్షించడం, ప్రస్తుతం సినిమాను తన భుజానికి ఎత్తుకున్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. ఆదివారం హైద్రాబాద్‌లో ఈ మూవీకి సంబంధించిన ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో చిరంజీవి, నాగ చైతన్య, ఆమిర్ ఖాన్‌లు పాల్గొన్నారు.

చిరంజీవి మాట్లాడుతూ... "ఓ రోజు జూమ్ కాల్ లో ఈ సినిమాను  మీరు ప్రెసెంట్ చేయాలి అని అమీర్ ఖర్ ఫోన్ చేసి రిక్వెస్ట్ గా అడిగారు. అయ్యో! మీరు ఆర్డినరీ సినిమాలు తీయరు కదా? సినిమాయే లైఫ్ అన్నట్లుగా ఎంతో రిస్క్ తీసుకుని, మంచి చిత్రాలు తీస్తారు. మీ సినిమాకు నేను సమర్పకుడిగా ఉండడం ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. సినిమాని నేను నాగ చైతన్య, రాజమౌళి, సుకుమార్ నా ఫామిలీ మెంబెర్స్ కలిసి చూసాం. చూస్తున్నంతసేపు ఎంతో భావోద్వేగానికి గురి అయ్యాము. కొన్ని సన్నివేశాలు  కంటిలో నీరును తెప్పించాయి. ప్రతి ప్రేక్షకుడు ఈ సినిమాకు కనెక్ట్ అవుతాడు." అని సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

అమీర్ ఖాన్ తన మాటల్లో "ఈ సినిమా కోసం ఫిజికల్‌గా ఎంతో కష్టపడాల్సి వచ్చింది. నేను ఇంత వరకు నా కెరీర్‌లో చేసిన సినిమాలు, 35 ఏళ్లలో పోషించిన పాత్రల్లో కెల్లా ఇదే అత్యంత చాలెంజింగ్ పాత్ర ఇదే. ఇందులో నేను ఎక్కువగా పరిగెత్తాల్సి వచ్చింది. దాదాపు ఇండియా అంతా కూడా పరిగెత్తాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పరిగెత్తాను. నాగ చైతన్యలోని ఆ అమాయకత్వం, నిజాయితే వల్లే ఈ పాత్రకు తీసుకున్నాం. ఎందుకంటే లాల్, బాలరాజు రెండు పాత్రలు అలానే ఉంటాయి. పాత్రకు బాగా సెట్ అయ్యాడు.అందులో లీనమవుతాడనే తీసుకున్నాం’" అంటూ ఆమిర్ ఇలా తన సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

‘ఆమిర్ ఖాన్ గారితో పని చేసే చాన్స్ వచ్చిందని, ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే ఈ సినిమాకు ఓకే చెప్పాను. అంతేకానీ బాలీవుడ్‌లో చాన్స్‌లు వస్తాయని కాదు. అయినా నేను అలా అనుకోలేదు. ఈ సినిమా తరువాత ఎలా ఉంటుందో తెలియదు. ఎలా ఉన్నా కూడా నాకు ఇక్కడే(టాలీవుడ్) బాగుంటుంది’ అని నాగ చైతన్య అన్నాడు. ‘ఈ సినిమా చూడకముందు.. ఏదో మాటిచ్చాం.. ప్రజెంట్ చేయాల్సిందే అనుకున్నాను. కానీ సినిమా చూశాక నాకు ఎంతో గర్వంగా అనిపించింది. సినిమా చూస్తున్నంత సేపు కంటతడి ఆరలేదు. గుండెలోని ఆర్థ్రత తగ్గలేదు. అలా ఎన్నో సీన్లలో గుండె తడి అవుతుంది. ఎన్నో సన్నివేశాల్లో మనకు ఏడుపు వస్తుంది. ఆమిర్ ఖాన్ ఎంతో చక్కగా ఈ పాత్రను పోషించారు. నాకు ఒక వేళ ఇలాంటి పాత్రను పోషించే అవకాశం వస్తే నేను పోషించలేను. అందులోనూ ఆమిర్ ఖాన్ ఓ పాత్రను చేశాక.. మళ్లీ నేను చేయలేను. లాల్ సింగ్ చడ్డా లాంటి సినిమాను నేను చేయను. చేయలేను. నేను ఎప్పుడు కూడా జనరంజక చిత్రాలు, జనాలు నా నుంచి ఏం ఆశిస్తుంటారో అవే చేస్తాను. నన్ను ఎలా చూడాలనుకుంటారో అలాంటి సినిమాలే చేస్తాను. ఆమిర్ ఖాన్‌లా ప్రయోగాలు చేయలేను. ఆయన ప్రయోగాలు చేసి, అందరి చేత ఒప్పించి, మెప్పిస్తుంటారు’ అని చిరంజీవి అన్నాడు.

 

 

Tags :