భారత్, చైనా చర్చలు విఫలం

భారత్, చైనా చర్చలు విఫలం

ఇటీవల మళ్లీ కయ్యానికి కాలు దువ్విన డ్రాగన్‌ దేశం చైనా చర్చలకు ముందుకు సాగనివ్వ లేదు. భారత్‌ చెప్పిన షరతులకు ఒప్పుకోలేదు. తదుపరి చర్చలకూ అంగీకరించలేదు. మొత్తంగా చర్చలు విఫలమయ్యాయి. ఇటీవల చైనా, భారత్‌ మధ్య 13వ రౌండ్‌ చర్చలు మొదలైన సంగతి తెలిసిందే. చైనా ఉన్నతాధికారులు భారత షరతులకు ఒప్పుకోవట్లేదని భారత ఆర్మీ ఉన్నతాధికారులు ప్రకటించారు. పరిష్కారం జరగని మిగతా ప్రాంతాలపై భారత్‌ నిర్మాణాత్మక సూచనలను చేసినా చైనా వినిపించుకోలేదని, వాటికి అంగీకరించలేదని తెలిపారు. దీంతో ఎలాంటి ప్రయోజనం లేకుండానే చర్చలు ముగిశాయని అన్నారు.

 

Tags :