ఆ యువనేత జైలుకు వెళ్లడం ఖాయం.. లోకేష్‌ను టార్గెట్ చేసిన లక్ష్మీ పార్వతి!

ఆ యువనేత జైలుకు వెళ్లడం ఖాయం.. లోకేష్‌ను టార్గెట్ చేసిన లక్ష్మీ పార్వతి!

టీడీపీ యువనేత నారా లోకేష్‌పై వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి పరోక్షంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ కుంభకోణంలో భారీ దోపిడీకి పాల్పడిన వాడు ఇప్పుడు నీతిమంతుడిలా ప్రజల ముందుకు వస్తున్నాడంటూ విమర్శించారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవడం చేతకాని వ్యక్తి పాద యాత్ర చేయడం హాస్యాస్పదం అంటూ వెటకారం ఆడారు. ఫైబర్ నెట్ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఫోకస్ పెట్టినా ఈ యువనేత జైలుకు వెళ్లడం ఖాయమని ఆరోపించారు.

అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై కూడా ఆమె విమర్శలు చేశారు. సహవాస దోషం పవన్ కల్యాణ్‌ను చెడగొడుతోందని, దాని వల్లనే పవన్ కల్యాణ్ తప్పుడు దారిలో వెళ్తున్నారని హితబోధ చేశారు. చంద్రబాబుతో కలిస్తే పవన్‌కు ఎలాంటి లాభం ఉండదని, మరింత నష్టం జరగుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో విపక్షాలు మరీ దారుణంగా ఉన్నాయని, ప్రజాకంటకంగా మారాయని మండిపడిన ఆమె.. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ కోసమే తీసుకువచ్చారంటూ ధ్వజమెత్తారు. ప్రజల తరఫున నిలబడాల్సిన వామపక్ష నేతలు నారాయణ, రామకృష్ణ తమ పార్టీలను చంద్రబాబుకు తాకట్టు పెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Tags :