రివ్యూ : గురి తప్పిన 'లక్ష్య' మ్

రివ్యూ  : గురి తప్పిన 'లక్ష్య' మ్

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థ:  శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు :  నాగశౌర్య, కేతిక శర్మ, జగపతిబాబు, సచిన్ ఖేడేకర్, శత్రు, రవిప్రకాశ్, సత్య తదితరులు
సంగీతం : కాలభైరవ, సినిమాటోగ్రఫీ :రామ్‌రెడ్డి, ఎడిటింగ్‌:  జునైద్ సిద్దిఖీ
నిర్మాతలు : నారాయణ దాస్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్
దర్శకత్వం:  ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి
విడుదల తేది : 10.12.2021

టాలీవుడ్‌లో తనకంటూ ఓ  ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు హీరో నాగశౌర్య. చాలా తక్కువ సమయంలోనే ఇరవై పైగా సినిమాలను పూర్తి చేసుకున్నాడు. ‘ఛలో’ సినిమాతో నిర్మాతగా మారి తొలి చిత్రమే హిట్‌ కొట్టాడు. ఆ తర్వాత ఆయన నిర్మాతగా, హీరోగా చేసిన న‌ర్త‌న‌శాల‌, అశ్వథ్థామ‌ బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడ్డాయి.  దీంతో చాలా గ్యాప్‌ తీసుకొని ఇటీవల లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’తో ప్రేక్షకులను పలకరించాడు. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఈసారి కొత్త  ప్రయోగానికి సిద్దమై.. తన కెరీర్‌లోనే తొలిసారి స్పోర్ట్స్ బేస్డ్ కాన్సెప్ట్‌తో ‘లక్ష్య’ మూవీ చేశాడు. ఈ చిత్రం కోసం తన శరీర ఆకృతిని సైతం కథకు అనుగుణంగా మార్చుకున్నాడు.  ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్‌ క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ని కూడా కొత్తగా, చాలా గ్రాండ్‌గా చేయడంతో ‘లక్ష్య’పై హైప్‌ క్రియేట్‌ చేశాయి. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్‌ 10) ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఏ మేరకు ఆకట్టుకుంది?  మరి ఈ సినిమా నాగశౌర్యను హిట్‌ ఖాతా లో చేర్చిందా ? రివ్యూలో చూద్దాం!

కథ:
పార్ధు(నాగశౌర్య) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో.. తాతయ్య రఘురామయ్య (సచిన్‌ ఖేడేకర్‌) దగ్గరే పెరుగుతాడు. అతని తండ్రి లాగే పార్దుకు కూడా విలువిద్య అంటే చాలా ఇష్టం. అతనిలోని క్రీడాకారుడిని గుర్తించిన తాతయ్య.. ఎలాగైన తన మనవడిని గొప్ప ఆర్చరీ ప్లేయర్‌ చేయాలని భావిస్తాడు. దాని కోసం ఊరిని వదిలి సిటీకి వస్తాడు. ఆస్తులన్ని అమ్మి మరీ మనవడి కోచింగ్‌ ఇప్పిస్తాడు. పార్ధు కూడా కష్టపడి స్టెట్‌ లెవన్‌ చాంపియన్‌ అవుతాడు. ఆ తర్వాత వరల్డ్‌ చాంపియన్‌ ట్రయల్స్‌కి సన్నద్దం అయ్యే సమయంలో గుండెపోటుతో తాతయ్య మరణిస్తాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన పార్ధు.. మత్తు పదార్ధాలకు బానిస అవుతాడు. డ్రగ్స్‌ తీసుకుంటేనే అతను వదిలిన బాణం గురి తప్పేది కాదు. ఈ విషయం తెలిసి అకాడమీ అతన్ని సస్పెండ్‌ చేస్తుంది. అసలు పార్థు మత్తు పదార్ధాలకు బానిస కావడానికి కారణం ఎవరు? అతడు ఆర్చరీలో ఉన్నత శిఖరాలు అందుకుంటాడా లేదా? హీరోయిన్ కేతిక పాత్ర ఎంత వరకు ఉపయోగపడింది లాంటివి తెలుసుకోవాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:
మూవీ లో మొట్టమొదటి బిగ్ ప్లస్ ఎవరైనా ఉన్నారు అంటే అది నాగశౌర్య అని చెప్పాలి. ఈ సినిమా కోసం తన కెరీర్ లో ఏ సినిమాకి పెట్టని ఎఫర్ట్స్ తాను పెట్టి ఆకట్టుకుంటాడు. ఒక్క తన బాడీ మార్చుకొని ఎనిమిది పలకలతో డిఫరెంట్ లుక్స్ ని చూపించడమే కాకుండా చాలా మంచి నటనను కూడా తాను కనబరిచాడు. అలాగే కొన్ని కీలకమైన ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా తన నటన మెచ్యూర్ గా ఉంది. ఇక హీరోయిన్ కేతిక శర్మ రోల్ కూడా సినిమాలో బాగుంది. తన లుక్స్ పరంగా కానీ శౌర్య తో సీన్స్ లో కానీ మంచి కెమిస్ట్రీ ఇద్దరి మధ్య కనిపిస్తుంది. అలాగే ఇద్దరి మధ్య కొన్ని కీ సీన్స్ లో కూడా తన ఎమోషన్స్ బాగున్నాయి. ఇక వీరితో పాటు నెగిటివ్ పాత్రలో కనిపించిన కిరీటి తన పాత్రకి కరెక్ట్ గా సెట్టయ్యారు. మంచి విలనిజం కనబరుస్తూ ఆ పాత్రకి తగ్గ ఎమోషన్స్ ని తాను పలికించి ఆకట్టుకున్నారు. సారథిగా జగపతి బాబు నటన బాగుంది. సత్య, భరత్ రెడ్డి, శత్రులతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక మిగతా నటి నటులు తమ పాత్రల మేర నటించారు.

సాంకేతికవర్గం పనితీరు:
ఈ చిత్రంలో ఈ కథా నేపథ్యానికి తగ్గట్టుగా నిర్మాణ విలువలు జస్ట్ ఓకే అని చెప్పొచ్చు. అది సినిమాటోగ్రఫీ వల్లనో ఏమో కానీ విజువల్స్ మాత్రం కాస్త డల్ గానే కనిపిస్తాయి. అలాగే మ్యూజిక్ వర్క్ బాగుంది. కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మళ్ళీ ఆకట్టుకుంటాడు. ఇక దర్శకుడు సంతోష్ జాగర్లపూడి విషయానికి వస్తే తన వర్క్ కూడా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఉందని చెప్పాలి. నిజంగా తాను ఎంచుకున్న కాన్సెప్ట్ చాలా కొత్తది ఎవరూ టచ్ చేయనిది దీనికి హర్షం వ్యక్తం చేయవచ్చు. అలాగే ఒక టైం కి అలా హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. కానీ తర్వాత తర్వాతకి కథనంలో లోపం కనిపిస్తుంది. పాత్రలను ఆయా ఎమోషన్స్ ని బలంగా ఎలివేట్ చెయ్యడంలో తాను తడబడ్డాడు. ఇంకా స్కోప్ ఉన్న కొన్ని సన్నివేశాలు  ఎంటర్ టైనింగ్ గా మలచి ఉంటే ఇంకా బెటర్ అవుట్ పుట్ ని తాను రాబట్టి ఉండొచ్చు. కానీ కథకు అది ఏరకంగా అవసరమే తెరపై చూపించలేకపోయాడు. క్లైమాక్స్‌ సీన్స్‌ కూడా చప్పగా సాగుతాయి. సినిమా  స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ కొత్తగా ఏమీ సాగదు. ఇంకా కొన్ని సీన్ లు  కట్ చెయ్యాల్సింది. ఇక కాలభైరవ సంగీతం కూడా అంతంత మాత్రమే అనే చెప్పాలి. గతంలో మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చిన కాలభైరవ లాంటి యంగ్‌ మ్యూజిక్‌ డైరక్టెర్‌ నుంచి దర్శకుడు మంచి సాంగ్స్‌ని రాబట్టుకోలేకపోయాడు. బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ కూడా వర్కౌట్‌ కాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నాయి.

విశ్లేషణ:
ఇక మొత్తంగా చూసినట్టు అయితే స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ ‘లక్ష్య’ ఫస్ట్ హాఫ్ వరకు డీసెంట్ కథనంతో కనిపిస్తుంది. అలాగే నాగ శౌర్య డెడికేషన్ కూడా చాలా ఇంప్రెస్ చేస్తుంది. కానీ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి పరిస్థితులు తారు మారు లా అనిపిస్తాయి. పేలవమైన ఎమోషన్స్ కథనం లు సినిమా ఫ్లో ని దెబ్బ తీశాయి. ఇంకా ఎంగేజింగ్ నరేషన్ ని క్లైమాక్స్ ని కానీ తీసి ఉంటే ఓవరాల్ గా సినిమా మెప్పించి ఉండేది. ఒక్కమాటలో చెప్పాలంటే.. దర్శకుడు వదిలిన బాణం గురి తప్పింది. కలెక్షన్ల పరంగా  ‘లక్ష్య’ లక్ష్యం ఏమేరకు నెరవేరుతుంతో వీకెండ్‌ వరకు వేచి చూడాలి.

 

Tags :