జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు

జనసేనతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్తామని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిగతి లేని పాలన సాగుతుందని మండిపడ్డారు. చిట్టచివరి వ్యక్తి కూడా ఫలాలు అందించాలని బీజేపీ ముందుకెళ్తోందన్నారు. చిట్టచివరి వ్యక్తి కూడా అతని సంపద దోచుకోవడానికి వైసీపీ పాలన సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఆరు వేలు కేంద్రం ఇస్తుంటే వాటిని రెండు రోజులు ఆపి మీటర్ నొక్కి ఇస్తున్నారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకానికి కూడా ఆయూష్మాన్ భారత్ నిధులు వాడుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంటలు మయం ఆయ్యాయని, జగనన్న గుంట పథకం ఏమైనా పెట్టారన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్‌లో ఉందని విమర్శించారు. వైసీపీ పార్టీ కార్యాలయాలు కట్టుకోవడానికి ప్రభుత్వ భూములు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎవరబ్బ సొమ్మని పార్ట్టీ కార్యాలయాలు కడతారు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనకి చరమగీతం పాడటం తథ్యమని స్పష్టం చేశారు.