లాటా ఆద్వర్యంలో "మనకోసం మన సంస్కృతి" కార్యక్రమానికి మంచి స్పందన

లాటా ఆద్వర్యంలో "మనకోసం మన సంస్కృతి" కార్యక్రమానికి మంచి స్పందన

లాటా ఆద్వర్యంలో జరిగిన "మనకోసం మన సంస్కృతి" కార్యక్రమానికి ఎంతో మంచి స్పందన వచ్చింది. గురువుగారు బ్రహ్మ శ్రీ డా|| సామవేదం షణ్ముఖశర్మ గారు చేసిన ప్రసంగం మన లాస్ ఏంజిల్స్ లో ఉన్న తెలుగువారికి ధర్మ మార్గం వైపు ఎలా నడవాలో దశానిర్దేశం చేసింది.

భారతీయ సాంస్కృతిక వైభవం, ప్రపంచ చరిత్రలో మనవారి స్థానం గురించి గురువుగారు అత్యద్భుతంగా వివరించారు.

ఈ కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మన వారు హాజరుకావటం లాటా కి మరింత మంచి కార్యక్రమాలని తలపెట్టే ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇచ్చాయి.

మనందరి కోసం వారి అముల్యసమయాన్ని వ్యచ్చించిన బ్రహ్మ శ్రీ డా|| సామవేదం షణ్ముఖశర్మ గారికి, లాటా వాలెంటీర్స్, EC, BOD మరియు సభకు వచ్చి విజయవంతం చేసిన లాస్ ఏంజిల్స్ తెలుగువారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము.

 

Tags :