టిఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం

టిఆర్ఎస్ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం

--52వ టీఆరెస్ ఎన్నారై శాఖ
--ఎన్నారై టీఆరెస్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల

తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కొరకు యూరోప్ పర్యటనలో ఉన్న మహేష్ బిగాల నిన్న చెక్ రిపబ్లిక్ లో ఎన్నారై లతో సమావేశమయ్యారు. టీఆరెస్ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంబించారు. మహేష్ మాట్లాడుతూ ఇది టీఆరెస్ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు. మిగతా యూరోప్ దేశాలమాదిరిగానే ఇక్కడ కూడా విశేష స్పందన లభించిందన్నారు. ఏ ఎన్నారై ని అడిగిన కెసిఆర్ గారు దేశ రాజకీయాలకు రావాలి దేశాన్ని చేయాలన్నారు చేయాలన్నారు. మోడీ పాలనలో దేశాన్ని బ్రష్టు పట్టించారన్నారు. మోడీ పాలనలో రూపాయి విలువ పడిపోయిందన్నారు.పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు రెక్కలచ్చాయన్నారు. తెలంగాణ కు ఆర్థిక సాయం చేయక పోగా చేసినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ పాలనలో ద్రవ్యోల్బణం అట్టడుగు స్థాయి కి చేరుకుంది. మోడీ తీసుకున్న పాత నోట్ల రద్దు, పంటల గరిష్ట ధర, అగ్నిపథ్ ఇలా అన్ని నిర్ణయాలు అట్టర్ ప్లాప్ అయినాయి. అందుకే కెసిఆర్ జై జై మోడీ బై బై అని నినదించారు. త్వరలోనే కమిటీ ప్రకటిస్తామన్నారు.

ఈ కార్యక్రమం లో తెలంగాణ ఆంద్రప్రదేశ్ మహా రాష్ట్ర, చెన్నై, కర్ణాటక, ఢిల్లీ ఎన్నారైలు రాఘవ రెడ్డి లోకసాని, పావని, ప్రేమ్, శిరీష, జై ప్రకాష్, ఆదిత్య, రవీంద్ర బాబు అరుణ్, శ్రీనాథ్, ప్రశాంత్, అభినవ్, బిరేన్ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :