MKOne Telugu Times Business Excellence Awards

లీగల్‌ ఫోరం సమావేశాలు

లీగల్‌ ఫోరం సమావేశాలు

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.  మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. ఈ సంబరాల్లో భాగంగా లీగల్‌ ఫోరం ఆధ్వర్యంలో లీగల్‌ కు సంబంధించిన విషయాలపై నిపుణులచేత ప్రసంగాలను ఇప్పిస్తున్నారు. 

ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఆల్టర్నేట్‌ కెరీర్స్‌ అంశం స్టూడెంట్‌ వీసా, పొడిగింపు వీసా వంటి విషయాలపై కవితా రామస్వామి మార్గనిర్దేశనం చేయనున్నారు. ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌ అంశం - ఇమ్మిగ్రేషన్‌ ఫర్‌ స్టూడెంట్స్‌, హెచ్‌ ఆర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ట్రైనింగ్‌ వంటి విషయాలపై జొన్నలగడ్డ శ్రీనివాస మాట్లాడుతారు. డొమెస్టిక్‌ వయెలెన్స్‌ - ప్రివెన్షన్‌ అండ్‌ సపోర్ట్‌ అనే అంశంతోపాటు, విల్స్‌ అండ్‌ ఎస్టేట్‌ ప్లానింగ్‌ అనే అంశంపై కూడా సునీత కె క్రోసూరి మాట్లాడనున్నారు.    

 

 

 

 

Tags :