కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం మరో  సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిళ్లకు వ్యతిరేకంగా త్వరలో చట్టం తేవాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. బలవంతపు మత మార్పిళ్ల అంశాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని, అతి త్వరలో దీనిపై చట్టం తీసుకొస్తామని వెల్లడిరచారు. ఇప్పటికే 9 రాష్ట్ర ప్రభుత్వాలు బలవంతపు మతమార్పిళ్లకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. కేంద్రం తరపున కూడా అతి త్వరలో చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

 

Tags :