న్యూడ్ వీడియో ఫేక్.. రియల్లో ప్రజలే తెలుస్తారు

న్యూడ్ వీడియో ఫేక్.. రియల్లో ప్రజలే తెలుస్తారు

కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయటం ఎంత అనివార్యమో, మంగళగిరి నుంచి లోకేశ్‌ పోటీ చేయడం కూడా అంతే అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ఈ సందర్భగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఫేక్‌ రియలో ప్రజలే తేలుస్తారని అన్నారు. ఫేక్‌ వీడియో అయితే నాలుగు గోడల మధ్య జరిగితే తప్పేంటి అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల ఎలా అంటారని ప్రశ్నించారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌ల వాయిస్‌ కూడా ఫేక్‌ అని తేల్చేశారా? అని నిలదీశారు. మాధవ్‌ వీడియోపై అనంతపురం ఎస్పీ వివరణను తప్పపట్టిన లోకేశ్‌, ఆయనేమైనా ఫోరెన్సిక్‌ నిపుణుడా అని నిలదీశారు. వీడియో ఒరిజినల్‌ కాదని చెప్పే ఫోరెన్సిక్‌ నివేదిక ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. మహిళలను కించపర్చే విధంగా వైసీపీ నేతలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాధవ్‌ గురిచి ఎస్పీకి బాగా తెలుసునకుంటా అని విమర్శించారు. ఇద్దరూ పోలీసులే కాదా అని ఎద్దేవా చేశారు.

 

Tags :