మెగా మిలియన్స్ డ్రాలో జాక్‌పాట్‌

మెగా మిలియన్స్ డ్రాలో జాక్‌పాట్‌

అమెరికాలోని మైన్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌లో రూ.10.973 కోట్లు గెలుచుకున్నాడు. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో నెలలో ఎప్పుడైనా 13వ తేదీ శుక్రవారాన్ని అన్‌లక్కీడేగా భావిస్తారు. కానీ అదే రోజు అతడికి భారీ జాక్‌పాట్‌ తగలడం విశేషం. జనవరి 13న మిలియన్స్‌ జాక్‌పాట్‌ తీసిన డ్రాలో విన్నింగ్‌ టికెట్‌ సంఖ్యతో అతడి  టికెట్‌లోని 30,43,45,46,51 నంబర్లు సరిపోలాయి. దీంతో అతడిని విజేతంగా ప్రకటించింది మెగా మిలియన్స్‌ జాక్‌పాట్‌. అతడు గెలుచుకున్న మొత్తం సొమ్మును లాటరీ నిర్వాహకులు,  29 ఏళ్లపాటు వాయిదాల పద్ధతిలో చెల్లిస్తారు. మొత్తం ఒకేసారి కావాలంటే రూ.7వేల కోట్లు మాత్రమే ఇస్తారు. కానీ చాలా మంది వాయిదాల పద్ధతిలో కాకుండా ఒకేసారి తీసుకుంటారు. 

 

 

Tags :