ఉత్కంఠ రేపుతున్న MAA ఎన్నికలు! రేపే ఫలితాలు

ఉత్కంఠ రేపుతున్న MAA  ఎన్నికలు! రేపే ఫలితాలు

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (మా) ఎన్నిక‌లకు సర్వం సిద్ధమైంది. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో రేపు(ఆదివారం)జరగునున్న మా ఎన్నికల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్‌ రాజ్‌ తమ సభ్యులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. రేపు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుంది. అదేరోజు రాత్రి 8 గంట‌లలోపు ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. అయితే ఈసారి ఎన్నడూ లేని విధంగా మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి.  దీంతో మా అధ్యక్షుడిగా ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

 

Tags :