అమెరికాలో ప్రమాదం.. తెలంగాణ విద్యార్థి మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కపెట్ట గ్రామానికి చెందిన బోయ మహేశ్ పై చదువుల కోసం గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్‌ఎస్ చేస్తున్నాడు. మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతవారు తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కప్పట గ్రామంలో విషాధచాయలు అలముకున్నాయి. మహేశ్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహేష్ తండ్రి బోయ వెంకట్ రాములు మహారాష్ట్రలో కాంట్రాక్టర్ వద్ద సూపర్ వైజర్‌గా పని చేస్తున్నాడు.